Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
Avinash Reddy: 28న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసు
Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 28న ఉదయం 11గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కొద్దిసేపటి క్రితమే పులివెందులలో నోటీసులు అందించారు సీబీఐ అధికారులు. ఇప్పటికే 23న హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో హాజరుకాలేనని అవినాష్ రెడ్డి చెప్పారు. దీంతో మరోసారి నోటీసులు పంపింది సీబీఐ.