మరోసారి తెరపైకి అయేషా మీరా హత్య కేసు
Ayesha Meera Case: మర్డర్ కేసులో మరోసారి విచారణ జరపనున్న సీబీఐ
Ayesha Meera Case: విజయవాడలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో ఇవాళ సీబీఐ అధికారులు విచారణ జరపనున్నారు. హత్య కేసులో సాక్షులను మరోసారి విచారించనున్నారు సీబీఐ అధికారులు. అయేషా డెడ్‌బాడీకి పంచనామా చేసినప్పుడు ఉన్న కృష్ణప్రసాద్‌ను సీబీఐ విచారించనుంది. అయితే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కృష్ణప్రసాద్ పేరును చేర్చారు. దీంతో కృష్ణప్రసాద్‌ను విచారించేందుకు సీబీఐ అధికారులు రెడీ అయ్యారు.