YS Viveka: వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జి షీటు
YS Viveka: పులివెందుల కోర్టులో చార్జిషీటు దాఖలు
YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎట్టకేలకు సీబీఐ చార్జి షీటు దాఖలు చేసింది. పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు కోర్టులో చార్జి షీటు దాఖలు చేశారు. సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, దస్తగిరిలపై అభియోగాలు నమోదు చేసి చార్జిషీటును కోర్టులో ప్రవేశ పెట్టారు వీరిలో సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డి అరెస్టయి ఇప్పటికే 90 రోజులు దాటుతున్న నేపధ్యంలో సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది.