తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు
* పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. పెద్దపప్పూరు మండలంలోని పలు గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేసి విద్వేషాలను రెచ్చగొట్టారని జేసీపై అభియోగం ఉంది. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని జేసీతో పాటు మరో ఆరుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.