Botsa Satyanarayana: బైజూస్ సంస్థ ఉచితంగానే కంటెంట్ ఇస్తుంది
Botsa Satyanarayana: విద్యార్థులను వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేయొద్దు
Botsa Satyanarayana: బైజూస్‌తో చేసుకున్న ఒప్పందంలో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు లేవన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బైజూస్ సంస్థ ఉచితంగానే కంటెంట్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. కొన్ని పార్టీలు అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. మెరుగైన విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న బొత్స... ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేయొద్దని రాజకీయ పార్టీలను కోరుతున్నానన్నారు బొత్స సత్యనారాయణ.