Buggana: వ్యక్తిగత విషయాలకు అసెంబ్లీలో చోటు లేదు
Buggana: సమస్యలు ఎక్కడ ప్రస్తావించాలో తెలుసుకోవాలి
Buggana: ఏపీ అసెంబ్లీలో కోటంరెడ్డి ఎపిసోడ్ హీట్ రేపింది. తన నియోజకవర్గ సమస్యలపై నిరసన గళం వినిపించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అసెంబ్లీ ప్రారంభంలోనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది. అయితే సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదన్న స్పీకర్.. సమస్యలు ఏవైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వాలని తెలిపారు.
ఇక కోటంరెడ్డి తీరుపై మంత్రి బుగ్గన అభ్యంతరం తెలిపారు. సభలో వ్యక్తిగత విషయాలకు చోటు లేదన్నారు. సమస్యలు ఉంటే ఏ వేదిక మీద ప్రస్తావించాలో తెలుసుకోవాలని హితవు పలికారు మంత్రి బుగ్గన.