ఏపీలో తారాస్థాయికి చేరుకున్న బ్రో ఫైట్.. చిరు వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్ ఎటాక్‌

Bro Movie Controversy: సినిమా వాళ్లు అందరూ వేరు.. పవన్ కల్యాణ్ వేరు

Update: 2023-08-09 04:31 GMT

ఏపీలో తారాస్థాయికి చేరుకున్న బ్రో ఫైట్.. చిరు వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్ ఎటాక్‌

Bro Movie Controversy: ఏపీలో బ్రో సినిమా పంచాయితీ కొనసాగుతోంది. బ్రో సినిమాలో తన క్యారెక్టర్‌ను పెట్టారంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్‌తో పాటు నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇటు జనసేన కార్యకర్తలు సైతం మంత్రి అంబటి రాంబాబుతో పాటు సీఎం జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబు, సీఎం జగన్‌లపై సినిమాలు తీస్తామంటూ హెచ్చరించారు. దీంతో బ్రో పంచాయితీ తారాస్థాయికి చేరుకుంది. బ్రో సినిమా బడ్జెట్‌తో పాటు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్‌‌పై విచారణ చేపట్టాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

అంబటి రాంబాబు విమర్శలతో సీన్‌లోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు చిరు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని.. పోలవరంతో పాటు అనేక సమస్యలు పరిష్కరించాల్సింది పోయి..పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమాల మీద పడటం ఏంటని ప్రశ్నించారు. పోలవరం, రోడ్లు వంటి సమస్యలు ఏపీలో చాలానే ఉన్నాయన్నారు. అంతే... అప్పటి వరకు జనసేన అంబటిగా సాగిన వివాదం చిరు వర్సెస్ వైసీపీగా మారింది. చిరంజీవిని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. సినిమా ఇండస్ట్రీలో పకోడీగాలు ఉన్నారంటూ కొడాలి నాని సంచలన ఆరోపణలు చేస్తే... సినిమా ఇండస్ట్రీ పిచ్చుకనా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చిరంజీవిని ప్రశ్నించారు. ఇటు పేర్ని నాని తనదైన శైలీలో చిరును టార్గెట్ చేశారు. తాను చిరు అభిమానిని అంటూనే... విమర్శలు చేస్తూ చూస్తూ ఊరుకోమంటూ సున్నితంగా హెచ్చరించారు.

ఏపీలో వైసీపీ వర్సెస్ చిరుగా రాజకీయ రగడ మారడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిరు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారన్న చర్చ జరుగుతోంది. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ముందే హైపర్ ఆది వైసీపీ నాయకులపై పరోక్షంగా విమర్శలు చేయడం, తర్వాత వాల్తేరు వీరయ్య 2 వందల రోజుల వేడుకలో చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వంటివి ఏపీలో రాజకీయ అగ్గిని రాజేశాయి. తనను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం పెద్దలు చేస్తున్న విమర్శలపై చిరు ఎలా స్పందిస్తారన్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News