Andrew Fleming about three capital bill : మూడు రాజధానులు పై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈరోజు ( శుక్రవారం ) ఆమోదం తెలిపిన
Andrew Fleming about three capital bill : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈరోజు ( శుక్రవారం ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.. నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ స్వాగతించారు. ఇదో గొప్పపరిణామం అని అన్నారు. రాజధానులుగా మారిన ఆ మూడు నగరాలు శాంతి, సౌభాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటునట్లుగా అయన వెల్లడించారు.
Significant news for the state of #AndhraPradesh - wishing the three state system generates prosperity for #Visakhapatnam #Amaravati and #Kurnool.
— Dr Andrew Fleming (@Andrew007Uk) July 31, 2020
Can't wait to revisit all three cities with my @UKinHyderabad colleagues when the 🌏 situation permits.
https://t.co/K0wzzlr66S
శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం తగ్గాక వీటిని సందర్శించేందుకు ఏపీకి వస్తానంటూ అయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఏపీ రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారైట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి భూమి పూజ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
చంద్రబాబు అసంతృప్తి ;
మూడు రాజధానుల నిర్ణయం పైన టీడీపీ నేతలు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన స్పందనని తెలియజేశారు. అమరావతి రాజధాని ప్రజల కల అని, దానిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కరోనాతో బాధపడుతుంటే..రాష్ట్రంలో రాజధాని చిచ్చు పెట్టారని అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు భూములిస్తామని స్వచ్చందంగా ముందుకొస్తే వారి ఆశలను సర్వనాశనం చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలని చెప్పారు.