Bridegroom Tests Positive For Covid19: నేటి పెళ్లి, కరోనాతో వాయిదా

Bridegroom Tests Positive For Covid19:ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది తూర్పుగోదావరి జిల్లాలోనే.

Update: 2020-07-24 03:30 GMT
Marriage Postpone (Representational Image)

Bridegroom Tests Positive For Covid19:ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది తూర్పుగోదావరి జిల్లాలోనే. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటున్నారు స్థానిక ప్రజలు. అయితే మంచి ముహూర్తం అనుకున్నారో ఏమో ఇదే జిల్లాకు చెందిన ఒక జంటకు నేడు వివాహం కానుంది. అయితే పెళ్లి హడావిడిలో అక్కడా, ఇక్కడా అనకుండా తిరిగిన పెళ్లి కొడుకు ఎందుకైనా మంచిదని పెళ్లికి ఒకరోజు ముందు అనగా గురువారం కరోనా టెస్టు చేయించుకున్నాడు. ఇంకేముంది పాజిటివ్ అని తేలింది. ఏం చేస్తాడు పాపం... కరోనా పేరెత్తితే హడలి పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పెళ్లి వేడుక తనే పాజిటివ్ తో ఉండగా పెళ్లి ఎలా చేసుకుంటామని అనుకుని వాయిదా వేసుకున్నాడు.

కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా వ్యాపిస్తుంది. వాళ్ళు వీళ్ళు అని తేడాలేకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తాజాగా తూర్పు గోదావరిలో జరిగిన ఘటన అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే కొత్తపేటకు చెందిన యువకుడికి బల్లకుర్రుకు చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇటు పెళ్లి కుమారుడు, అటు పెళ్లి కూతురు ఇళ్ల‌లో జోరుగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.. అయితే.. కొన్ని రోజుల క్రిత‌మే క‌రోనా టెస్ట్ చేయించుకున్నాడు పెళ్లి కుమారుడు. కానీ, ఏర్పాట్ల‌లో మునిగిపోయిన స‌మ‌యంలో క‌రోనా పాజిటివ్ అంటూ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఇక‌, అంతే పెళ్లికొడుకును క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. దీంతో పెళ్లి వాయిదా పడింది. మరోవైపు ఇరుకుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ లు చేసేందుకు సిద్ధం అయ్యారు. 

Tags:    

Similar News