Andhra Pradesh: కర్నూలు జిల్లాలో కరోనా నిబంధనలు ఉల్లంఘన
Andhra Pradesh: అధికారుల సమక్షంలో నిబంధనలకు తూట్లు * వందలాది మందితో డ్యాన్స్ షో కార్యక్రమం
Telangana: వైద్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఆసుపత్రుల్లో ఫైర్ సెఫ్టీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కరోనా పేషంట్లతో అన్ని దవాఖానలు నిండిపోయాయి. పైగా వేసవి కాలం ఈ సమయంలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. గాంధీ, టిమ్స్ లాంటి ఆసుపత్రల వద్ద ఫైర్ ఇంజిన్లు పెట్టాలని అన్నారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోం ఐసోలేషన్ కిట్స్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మానిటర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు.