Minister Botsa: చంద్రబాబు జీవితంలో దొరికితే దొంగ.. లేకుంటే దొర అనే విధంగా ఉంది
Minister Botsa: ఇన్ని రోజులు అవినీతి కేసులను మేనేజ్ చేసిన చంద్రబాబు పాపం పండింది
Minister Botsa: చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితంలో దొరికితే దొంగ.. లేకుంటే దొర అనే విధంగా ఉందని మంత్రి బొత్స విమర్శించారు. ఇన్ని రోజులు అవినీతి కేసులను మేనేజ్ చేసిన చంద్రబాబు పాపం పండిందన్నారు. సీఐడీ అన్ని కోణాల్లో విచారణ జరిపి అరెస్ట్ చేసిందన్నారు. సీఐడీ తప్పుడు రిపోర్ట్ ఇస్తే న్యాయ వ్యవస్థ రిమాండ్ ఎందుకు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబు తప్పును ఒప్పుకొని రాజకీయాలను నుంచి వైదోలగాలని ఆయన హితవు పలికారు.