Bjp Leader Somu Veerraju: అది అనాలోచిత వైఖరి: సోము వీర్రాజు
Bjp Leader Somu Veerraju | టిటిడి అంశం మీద టిటిడి బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి వెలువరించినటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది.
Bjp Leader Somu Veerraju | టిటిడి అంశం మీద టిటిడి బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి వెలువరించినటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది. పెద్దలు, స్వర్గీయ అబ్దుల్కలాం గారు టిటిడిని సందర్శించిన సందర్భంలో వారు రిజిస్టర్లో సంతకం పెట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇది యావత్ భారత దేశంలో అన్యమతస్థులకి వర్తించే అంశం ఈఅంశాన్ని గమనించి ప్రకటన చేయాల్సిన సందర్భంలో వివాదాస్పదమైనటువంటి అంశాన్ని టిటిడి ఛైర్మన్ ప్రస్తావించడం అనాలోచిత వైఖరి అని ట్వీట్ చేసారు. అంతే కాదు, అన్యమతస్థులు.. భక్తీ, విశ్వాసాలతో స్వామివారిని దర్శించుకోవచ్చని సుబ్బుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అయితే, ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి మరోసారి స్పందించారు. గతంలో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో సోనియాగాంధీ, వైయస్ రాజశేఖరరెడ్డి డిక్లరేషన్ లో సంతకం చేయలేదని ఆయన తెలిపారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈనెల 23న స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే సమయంలో సీఎం జగన్ కూడా డిక్లరేషన్ పై సంతకం చెయ్యరని అన్నానని చెప్పారు. హిందూయేతరులు ఎవరు వచ్చినా డిక్లరేషన్ పై సంతకం చేయాలని చట్టంలో ఉందని తెలిపారు.