నెల్లూరులో త్వరలో బయో ఇథనాల్ ప్రాజెక్ట్
*ఏపీని సంక్షేమాభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు సీఎం హోదాలో దావోస్ పర్యటనకు జగన్
Nellore: సంక్షేమం ఒక్కటే 2024లో వైసీపీని అధికారంలోకి తీసుకురాదని జగన్ భావిస్తున్నారా..? ఫస్ట్ హాఫ్ మొత్తం సంక్షేమంపై దృష్టి పెట్టిన సీఎం... సెకండ్ హాఫ్ అభివృద్ధిపై దృష్టి పెట్టారా..? ఏపీని సంక్షేమ, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనుకుంటున్న జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? సీఎం హోదాలో మొదటి సారి దేశందాటుతున్న జగన్ రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో ఫలితం తీసుకురాగలరా..?
ప్రతిపక్షాలు విమర్శించడానికి ఏ కోణంలో అవకాశం ఇవ్వకూడదనుకుంటున్నారు సీఎం జగన్. దీంట్లో భాగంగా సంక్షేమం ఒక్కటే వర్కౌట్ కాదని.. అభివృద్ధి కూడా ముఖ్యమని భావిస్తున్నారు. జగన్ తన రూలింగ్‌కు సంబంధించి సెకండాఫ్‌లో అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. మౌలిక వసతుల కల్పనపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ల రూపకల్పనకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెల్లూరులో త్వరలో బయో ఇథనాల్ ప్రాజెక్ట్ మొదలు కాబోతోంది.
దీంతో పాటు స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో కాస్టిక్ సోడా ప్లాంట్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆ ప్లాంట్ వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పుడు క్రిభ్కో ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 560 కోట్ల రూపాయలతో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.
100 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విత్తన శుద్ధి, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు, ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022-27 రూపకల్పనకు ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద జగన్ ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి, మౌళిక వసతులు, ఉపాధి కల్పన కార్యక్రమాలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది.
గడప గడపకు కార్యక్రమంలో అసలు జనాలు ఏమనుకుంటున్నారు..? ఏమి కోరుకుంటున్నారనే విషయంపై ఓ క్లారిటీకి రాబోతున్నారు జగన్. ఆ రిపోర్టులన్నీ వచ్చిన తర్వాత మరోసారి లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టి కొత్త కార్యాచరణ మొదలు పెట్టడానికి రెడీ అవుతారు. ఇలా మొన్నటి వరకు సంక్షేమంపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు అబివృద్ది పై దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే ఏపీని సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి హోదాలో దేశం దాటి దావస్ వెళ్తున్నారు.