Chandrababu: చంద్రబాబుతో ములాఖత్‌కు భువనేశ్వరికి అనుమతి నిరాకరణ

Chandrababu: మూడోసారి ములాఖత్‌కు ఉన్నతాధికారుల పర్మిషన్‌ కావాలంటున్న సిబ్బంది

Update: 2023-09-15 06:22 GMT

Chandrababu: చంద్రబాబుతో ములాఖత్‌కు భువనేశ్వరికి అనుమతి నిరాకరణ

Chandrababu: చంద్రబాబు భార్య భువనేశ్వరికి రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులు షాక్‌ ఇచ్చారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు ఉన్నారు. అయితే.. చంద్రబాబుతో ములాఖత్‌కు ఆయన భార్య భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబుతో ములాఖత్‌ను జైలు అధికారులు తిరస్కరించారు. ఇప్పటికే ఈ వారంలో రెండుసార్లు చంద్రబాబు కుటుంబసభ్యులు ములాఖత్‌ అయ్యారు. మూడోసారి ములాఖత్‌కు ఉన్నతాధికారుల పర్మిషన్‌ కావాలని జైలు సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్‌ సెలవుల్లో ఉండటంతో.. భువనేశ్వరి దరఖాస్తును రిజెక్ట్‌ చేశారు అధికారులు.

Tags:    

Similar News