AP POLYCET 2022: ఏపీ పాలిటెక్నిక్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..

AP POLYCET 2022: ఏపీ పాలిటెక్నిక్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..

Update: 2022-04-14 04:30 GMT

AP POLYCET 2022: ఏపీ పాలిటెక్నిక్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..

AP POLYCET 2022: ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ polycetap.nic.inలో, ఆన్‌లైన్‌ మోడ్‌లో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితోపాటు ఏప్రిల్‌/మే 2022 టెన్త్‌ పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్ధులు కూడా అప్లై చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.400లు విధిగా చెల్లించాలి. ఏప్రిల్‌ 11 నుంచి వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్ధులు చివరితేదీ వరకు వేచి ఉండకుండా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యా మండలి ఈ సందర్భంగా సూచించింది. ఇక పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష మే 29 (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఇంజనీరింగ్ / నాన్ ఇంజనీరింగ్ / టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి ఏపీ సాంకేతిక విద్యా, శిక్షణామండలి (SBTET AP) ప్రతి ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఫలితాలు జూన్‌ 10 విడుదల్యే అవకాశముంది. 

Tags:    

Similar News