టీడీపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో బీద రవిచంద్ర!

ఈ నెల 27వ తేదీన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్బంగా పార్టీ ఏపీ శాఖకు నూతన అధ్యక్షున్ని నియమించాలని..

Update: 2020-09-24 04:47 GMT

ఈ నెల 27వ తేదీన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్బంగా పార్టీ ఏపీ శాఖకు నూతన అధ్యక్షున్ని నియమించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షుల్ని నియమించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండబోతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేరును చంద్రబాబాబు దాదాపు ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు.

ఈ తరుణంలో మరో పేరు కూడా ప్రచారంలో ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. సీనియర్ల బదులు యువ నేతలను ఈ పదవులకు ఎంపిక చేస్తే ఉత్సాహంగా ఉంటుందని.. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారని కొందరు సీనియర్లు చంద్రబాబు వద్ద ప్రతిపాదించడంతోనే.. రవిచంద్ర పేరు పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీద రవిచంద్ర నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అయిష్టత కనబరుస్తున్నారు.. తనకు శ్రీకాకుళం లోక్‌సభ ఎంపీ బాధ్యతలు ఉన్నందువల్ల అధ్యక్ష పదవికి తగిన న్యాయం చేయలేననే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News