ఆకట్టుకుంటున్న జలపాతం: నయాగరా కాదు..ఆంధ్రప్రదేశ్ లోనే!
* నెల్లూరు జిల్లా సరిహద్దులో సుందరమైన దృశ్యం * వందల అడుగుల నుంచి జాలు వారుతున్న నీళ్లు * కొండకొనల్లో కొలువు దీరిన పెనుశిల లక్ష్మినరసింహస్వామి * ఏపీ, తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్న పర్యటకులు * కొండపై నుంచి వచ్చే నీటితో స్నానం చేస్తే దోషాలు మాయం
ప్రకృతి రమణీయతతో కలగలసిన ఆధ్యాత్మిక సౌరభాలు.. ఒక పక్క జల జల జారే జలపాతాలు కనువిందు చేస్తాయి అక్కడ.. మరో వైపు ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నట్టుగా ఉండే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.. రెండిటినీ కలగలిపి ఒకే దగ్గర ఆస్వాదించాలంటే నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే.
ఒక పక్కన ఎత్తైన కొండలు.. మరోపక్కన పచ్చదనం పరిఢవిల్లే ప్రకృతి సోయగాలు.. ఆ ఎత్తైన కొండల నుంచి జాలు వారే జలపాతాలు.. గలగల పారే సేలయేర్లు.. మనసు పుకరింపజేసే పిల్ల తిమ్మెరలు. పరవసింపజేసే ప్రకృతి అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఎంత చూసిన తనివితీరవు. ఆ ప్రకృతిని వర్ణించేందుకు పదాలు కూడా చిన్నబోతాయి. అలాంటి అందమైన ప్రకృతి రమణీయం, సుందరమైన ఆనంద దృశ్యాలు చూడాలంటే నెల్లూరుకు వెళ్లాల్సిందే.
ఒక పక్కన చుట్టు ఆకాశ శిఖరాన్ని తాకే ఎత్తైన కొండలు.. మరోపక్కన ఆ కొండల నుంచి జాలువారే నీటి ధార.. దానికి తోడు వరుసగా కురుస్తున్న వర్షాలకు అడవి పచ్చదనం పరుచుకుంది. మరోవైపు గలగల పారుతున్న సెలయేర్లు సుందర దృశ్యానికి నిలువుటద్దంగా మారాయి. అన్ని కలిపి ఆ ప్రాంతాన్ని సుందర సుమనోహర దృశ్యానికి వేదికగా నెల్లూరు జిల్లా పెనుశిల కొండ మారింది.
నయాగారాను మించిన ఎత్తైన కొండ శిఖరం నుంచి జాలువారుతున్న నీటి ధార పర్యాటకుల మనసులు పులకింపజేస్తున్నాయి. ఆ అందమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
నెల్లూరు జిల్లా సరిహద్దులో ఈ అందమైన దృశ్యం దాగి ఉంది. మనసును పులకరింజేస్తున్న ఈ ప్రకృతి సోయగాల వెనుక ఒక ఆధ్యాత్మిక చరిత్ర ఉందని ఇక్కడి పెనుశిల స్వామి ఆలయ స్థల పురాణం చెబుతోంది. ఈ జలపాతం పక్కనే శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహస్వామి కొలువై ఉన్నారు. కొండలపై నుంచి జాలువారే జలపాతలలో సహజసిద్ధమై సప్తతీర్ధాలు కొలువుదీరి ఉన్నాయని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఈ అందమైన జలపాతం చూసేందుకు చుట్టు పక్కల ఉన్న జిల్లాల వారే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యటకులు వస్తుంటారు.
ఈ జలపాతానికి వస్తే అటు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో పాటు.. సుందర దృశ్యాన్ని చూడవచ్చని పర్యటకులు అంటున్నారు. వందల అడుగుల పై నుంచి నురగలు చిమ్ముతూ వచ్చే జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు.