Badvel By-Election Result: నేడు బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం విడుదల
* బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ * ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
Badvel By-Election Result: కొన్నిగంటల్లో బద్వేల్ బాద్‌షా ఎవరో తేలిపోనుంది. బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రౌండ్ వారీగా ఫలితాలను డిస్‌ప్లే చేస్తారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ రెండు కేటగిరీలు ఉంటాయి. అవి సర్వీస్ ఓట్లు, వయోవృద్ధుల ఓట్లు. కౌంటింగ్ మొదలయ్యే వరకు సర్వీస్ ఓట్లను అనుమతిస్తారు.