Ayyanna Patrudu: జగన్ తండ్రి పాలనలో కూడా ఇంత దౌర్జన్యం జరగలేదు
Ayyanna Patrudu: ఈ ప్రభుత్వం పౌర హక్కులను భంగం కలిగిస్తుంది
Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణాసురుడి రాజ్యంలో రాముడు ఎలా కనపడతాడని అయ్యన్నపాత్రుడు అన్నారు. నా రాజకీయ చరిత్రలో ఎంతో మంది సీఎంలను చూశాను..జగన్ తండ్రి పాలనలో కూడా ఇంత దౌర్జన్యం జరగలేదని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పౌర హక్కులను భంగం కలిగిస్తుందని ఆయన విమర్శించారు. రోజాను తిట్టినందుకు బండారు సత్యనారాయణపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టిన రోజాపై కేసులు ఎందుకు ఉండవని అయ్యన్నపాత్రడు ప్రశ్నించారు.