Aurobindo Pharma Foundation COO Praises YS Jagan : సీఎం జగన్ కు ప్రశంసలు..ఎందుకో తెలుసా?

Aurobindo Pharma Foundation COO Praises YS Jagan : కుయ్..కుయ్ అంటూ ప్రసంగాల్లో తను ప్రవేశపెట్టిన అంబులెన్స్ ల జరిగిన లబ్ధిని వివరిస్తూ అప్పట్లో తాను అధికారంలో ఉండి, రెండో సారి ఎన్నికలకు వెళ్లిన దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి చెప్పేవారు.

Update: 2020-07-10 04:18 GMT
Aurobindo Pharma Foundation COO Praises YS Jagan about 108 services

Aurobindo Pharma Foundation COO Praises YS Jagan : కుయ్..కుయ్ అంటూ ప్రసంగాల్లో తను ప్రవేశపెట్టిన అంబులెన్స్ ల జరిగిన లబ్ధిని వివరిస్తూ అప్పట్లో తాను అధికారంలో ఉండి, రెండో సారి ఎన్నికలకు వెళ్లిన దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి చెప్పేవారు. అప్పట్లో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముక్కోణ పోటీ ఉన్నాఇలాంటి పనులే తిరిగి వైఎస్ ను అధికారంలోకి తెచ్చాయి. అలాంటి పథకాలు ఆయన మరణం తర్వాత నిర్లక్షానికి గురయ్యాయి. ఆ తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన ఆయన తనయుడు  108, 104 అంబులెన్స్‌ సర్వీసుల ద్వారా  సేవలందించేందుకు ఒకేసారి 1088 వాహనాలను ప్రారంభించారు. వీటిని ప్రారంభించిన రెండో రోజే చిత్తూరు జిల్లాలో గర్భవతి అయిన ఒక మహిళ నేరుగా 108లో ఆస్పత్రికి వెళ్తూ అందులోనే పురుడు పోసుకుంది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి ఇలాంటి మేళ్లు జరిగితే ఎవరైతే మెచ్చుకోకుండా ఉండగలరు. అందుకే అరబిందో ఫార్మా సీఓఓ సాయిరామ్ స్వరూప్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్ వాహనాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) సాయిరామ్‌ స్వరూప్‌ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక​ పరిజ్ఞానంతో 104, 108 అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించడం ద్వారా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో 108 లు ఏర్పాటు చేశామని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2015లో స్థాపించిన ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో అంబులెన్స్‌ సేవలు అందేలా ఏర్పాటు చేశామన్నారు.

108 ద్వారా 3558 మందికి అంబులెన్స్‌లో ఉద్యోగాలు ముఖ్యమంత్రి కల్పించారని సాయిరామ్‌ స్వరూప్‌ అన్నారు. జిల్లాలలో శిశు మరణాలు తగించడానికి ప్రణాళిక కూడ పెట్టామని, అత్యాధునిక పరిజ్ఞానంతో అంబులెన్సు ద్వారా అందరికి మెరుగైన వైద్యం అందిచవచ్చన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కరోనాకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. 108,104 సర్వీసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యపరంగా కొత్త విప్లవాన్ని చూస్తారన్నారు.

Tags:    

Similar News