Aruku MLA comment on CM Jagan: జగన్ గిరిజన పక్షపాతి : అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ
Aruku MLA comment on CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గిరిజన పక్షపాతి అని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కొనియాడారు.
Aruku MLA comment on CM JAGAN: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గిరిజన పక్షపాతి అని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కొనియాడారు. నియోజకవర్గానికి కేటయించిన 108, 104 వాహనాల వల్ల ఏ సమయంలో ప్రమాదం సంభవించినా నేరుగా ఆస్పత్రికి చేరే అవకాశం ఉంటుందన్నారు.
- అరకులోయ నియోజకవర్గానికి చేరుకున్న 104 108 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ .
- అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల ఆరు 104 ఆరు 108 వాహనాలు మంజూరయ్యాయని వాటిని ఈ రోజు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు.
- సీఎం జగన్ గిరిజన పక్షపాతి కావున ఏజెన్సీకి వైద్య పరంగా పలు చర్యలు చేపడుతున్నారనీ అన్నారు.
- ఈ అంబులెన్స్ ల ద్వారా మారుమూల ప్రాంతాల వారు కూడా 15 నిమిషాలలో సమీప ఆసుపత్రులకు తరలించేందుకు వీలవుతుందన్నారు.
- ఈ సేవలను గిరిజనులు అందరు వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే ఫాల్గుణ పిలుపునిచ్చారు.
- అనంతరం ఎమ్మెల్యే ఫాల్గుణ 108 వాహనాన్ని అరకు లోయ అరకు గ్రామాలలో స్వయంగా తానే నడుపుతూ ప్రజలను ఉత్సాహపరిచారు.
- ఇటీవలే ముఖ్యమంత్రి 1088 అంబులెన్స్ లను విజయవాడలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వాహనాలను జిల్లాల వారిగా కేటాయించారు.
- అరకు చేరుకున్న వాహనాలను ఈరోజు ఎమ్మెల్యే ప్రారంభించారు.
- గిరిజన గ్రామాల్లో అరకొర వైద్య సదుపాయాలతో అల్లాడిపోతున్న తమకుఈ వాహనాల ద్వారా వైద్యసహాయం సకాలంలో అందుతుందని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.