UPSC Civil Services Exams: యూపీఎస్పీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు -2020 కి ఏర్పాట్లు!

UPSC Civil Services Exams | యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు -2020 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు అధికారులు.

Update: 2020-09-25 14:42 GMT

UPSC Civil Services Exams | యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు -2020 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు అధికారులు. అక్టోబర్ 4న రెండు సెషన్లలో నిర్వహణకు రంగం సిద్ధం ఉదయం 9:30 నుండి 11:30 వరకు మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు 68 సెంటర్లతో తిరుపతి, విశాఖ, విజయవాడ, అనంతపురంలలో నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ పరీక్షకు కో-ఆర్డినేటింగ్ సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు, పరిశీలకులు విశాఖ, విజయవాడ లకు ఇద్దరు అధికారులు, అనంతపురం, తిరుపతి లకు ఒక ఆఫీసర్ ను నియమించారు. 30,199 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు అని సమాచారం.

పరీక్ష ప్రారంభానికి ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి అని, పరీక్ష ప్రారంభానికి గంట ముందు ఎంట్రీ గేట్ తెరవబడుతుంది అని అధికారులు తెలిపారు. అంతే కాదు, పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు మాత్రమే అభ్యర్ధులను పరీక్షా హాల్లోకి అనుమతి ఇస్తామని అధికారులు వెల్లడించారు. కోవిడ్ నిబందనలు తప్పనిసరిగా అందరూ పతంచాలి.. అంతే కాదు, పరీక్షకు హాజరయ్యేవారు బ్యాగ్‌లు, మొబైల్ ఫోన్లు, ఐటి గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ లేదా కమ్యూనికేషన్ పరికరాలు వారి వెంట తీసుకురావద్దని అధికారులు హెచ్చరించారు.

కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని శానిటైజేషన్ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది.. అదే విదంగా వాష్‌ రూమ్‌లు, మరుగుదొడ్లు, వాష్ బేసిన్లు, వాటర్ పాయింట్లు, లిఫ్ట్‌లు పరిశుభ్రంగా ఉంచాలి అని, అభ్యర్థులందరికీ మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరి, 50 మి.లీ. హ్యాం శానిటైజర్, త్రీ ప్లై మాస్క్, గ్లోవ్స్ అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. ప్రతి అభ్యర్థికి 2 చదరపు మీటర్ల సామాజిక దూరంతో పరిక్షా హాల్ లో ఏర్పాట్లు చేశామన్నారు. అంతే కాదు, పరిక్షలు జరిగే రోజున విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ప్రభుత్వం కలెక్టర్ లకు ఆదేశాలను జారీచేసింది.  

Tags:    

Similar News