Guntur: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

Guntur: గుంటూరు నగర కార్పొరేషన్ తో పాటు జిల్లాలో ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్ రేపు జరగనుంది

Update: 2021-03-13 11:20 GMT

ఓట్ల లెక్కింపు (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Guntur: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు గుంటూరు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు నగర కార్పొరేషన్ తో పాటు జిల్లాలో ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్ రేపు జరగనుంది. గుంటూరు కార్పొరేషన్‌లోని 57 డివిజన్లకు ఎన్నిక జరగగా రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్లపాడులోని పాలిటెక్నిక్ కాలేజ్‌లో 34 డివిజన్లు.. లయోలా కాలేజ్ లో 24 డివిజన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక మరో ఐదు మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు కోసం తెనాలి, సత్తెన పల్లి, వినుకొండ, రేపల్లె, చిలకలూరి పేటల్లో కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే ఇందులో నాలుగు మున్సిపాలిటీల ఫలితాలు మాత్రమే రేపు వెలువరించనున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చిలకలూరి పేటలో కౌంటింగ్ జరిగినా ఫలితాన్ని ప్రకటించరు.

ఇక ఇప్పటికే జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. రేపటి ఫలితాల్లో కూడా తమ పార్టీకి ఏకపక్ష విజయం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. గుంటూరు కార్పొరేషన్‌లో వైసిపి జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News