Vizainagaram: మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ చూసి ఐదు కోట్లకు స్కెచ్.. అడ్డంగా బుక్కయిన ఆర్మీ జవాన్!

Vizainagaram: క్రైమ్ వెబ్ కంటెంట్ చూసి నేరాల బాట పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసి ఏకంగా ఓ ఆర్మీ ఉద్యోగి నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తాడు.

Update: 2021-03-21 10:06 GMT

Vizainagaram: మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ చూసి ఐదు కోట్లకు స్కెచ్.. అడ్డంగా బుక్కయిన ఆర్మీ జవాన్!

Vizainagaram: క్రైమ్ వెబ్ కంటెంట్ చూసి నేరాల బాట పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసి ఏకంగా ఓ ఆర్మీ ఉద్యోగి నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తాడు. రూర్కి కంటోన్మెంట్‌లో సోల్జర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరరావు ఈజీ మనీ కోసం బంగారం వ్యాపారిని టార్గెట్ చేశాడు. మావోయిస్టు పేరుతో బెదిరింపులకు పాల్పడడమే కాకుండా ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేశాడు. దీంతో ఖంగు తిన్న గోల్డ్ వ్యాపారి విజయనగరం పోలీసులను ఆశ్రయించాడు. రెండు బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నకిలీ మావోయిస్టు గుట్టురట్టు చేశారు.

మరోవైపు రాజేశ్వరరావు రూర్కి కంటోన్మెంట్‌లో ఆర్మీ సోల్జర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భూమి కొనుగోళ్ల వ్యవహారంలో 22 లక్షల రూపాయలు నష్టపోవడంతో ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ ఎంచుకున్నట్లు పోలీసులు తేల్చారు. అంతేకాదు ఆర్మీలో సెలవులపై వస్తున్నప్పుడే యూపీలో 30 వేలు పెట్టి ఓ వెపన్ కూడా కొనుగోలు చేశాడు రాజేశ్వరరావు. ఈ మొత్తం ప్లాన్‌ను బాలీవుడ్ వెబె సిరీస్ మీర్జాపూర్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నట్లు విజయనగరం ఎస్పీ రాజకుమారి తెలిపారు.

Tags:    

Similar News