City Bus Services in AP: ఏపీలో రేపటి నుంచి సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్...

City Bus Services in AP | ఏపీలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా దెబ్బతో డీపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి నడవనున్నాయి.

Update: 2020-09-18 03:39 GMT

City Bus Services in AP | ఏపీలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా దెబ్బతో డీపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి నడవనున్నాయి. తోలి విడతలో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో బస్సులు నడపనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ.. సిటీ బస్సులను నడపనుంది. అయితే, తొలుత ఒక్కో నగరంలో 200 నుంచి 300 బస్సులను తిప్పాలని అధికారులు నిర్ణయించారు. బస్సులో 60 శాతం ప్రయానికులను మాత్రమే అనుమతించనుండగా.. ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డ్ సచివాలయ పరిక్షలు జరగనున్న నేపధ్యంలో అదనపు బస్సులు తిప్పనున్నారు అధికారులు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు డీపోలకే పరిమితమయ్యాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో 6 నెలల తర్వాత బస్సులు రోడ్డ్ ఎక్కనున్నయాయి.

మరో వైపు రాష్ట్రం కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు 6,01,462 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,08,088 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 88,197 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 48,84,371 కరోనా శాంపిల్స్ కు పరిక్షలు నిర్వహించింది ప్రభుత్వం. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,177 కు చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 82,447, కర్నూల్ జిల్లా 53,098, అనంతపురం జిల్లా 51,358, పచ్చిమ గోదావరి జిల్లా 54,635, చిత్తూర్ జిల్లా 52,421, విశాఖపట్నం జిల్లా 45,686, గుంటూరు జిల్లాలో 47,880, నెల్లూరు లో 46,122, కడప 38,325, ప్రకాశం జిల్లాలో 39,443 కేసులు నమోదయ్యాయి. 

Tags:    

Similar News