APSRTC logistics conductors:రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్లకు ఇతర బాధ్యతలు..

APSRTC logistics conductors: కరోనా వ్యాప్తి సమయంలో అరకొరగా తిరుగుతున్న సర్వీసుల వల్ల ఖాళీగా ఉన్న కండక్లర్లకు ఇతర భాద్యతలు అప్పగించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-07-04 07:15 GMT

APSRTC Logistics: కరోనా వ్యాప్తి సమయంలో అరకొరగా తిరుగుతున్న సర్వీసుల వల్ల ఖాళీగా ఉన్న కండక్లర్లకు ఇతర భాద్యతలు అప్పగించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వీరికి ప్రత్యేకంగా బుకింగ్ ఏజెంట్లుగా నియమించేందుకు నిర్ణయించింది.

క‌రోనా లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులకు చేదోడు వాదోడుగా నిలిచిన‌ ఆర్టీసీ కండక్టర్లు…ఇక‌పై సరకు రవాణా బుకింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లుగా సేవ‌లు అందించ‌నున్నారు. ప్ర‌స్తుతం లాక్ డౌన్ ముగిసి అన్‌లాక్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అంత‌రాష్ట్ర స‌ర్వీసులు మిన‌హా బస్సులు తిరుగుతున్నాయి. కానీ ఆన్‌లైన్‌ బుకింగ్‌తో కండక్టర్లు లేకుండానే ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కండక్టర్ల సేవలను లాజిస్టిక్‌ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉపయోగించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.

ఏపీ వ్యాప్తంగా 57 డిపోలు, 2 ప్రధాన బస్‌ స్టేషన్లలో… మ్యాన్‌పవర్‌, హార్డ్‌వేర్‌ సరఫరా చేస్తున్నారు కాంట్రాక్టర్లు. మిగిలిన 71 డిపోల్లో ఏజెంట్లు లాజిస్టిక్‌ వ్యాపారాన్ని ర‌న్ చేస్తున్నారు. కాంట్రాక్టర్స్ నిర్వహిస్తున్న వాటితో పోల్చితే ఏజెంట్స్ నిర్వహిస్తున్న డిపోల్లో తక్కువ ఆదాయం వస్తోందని ఆర్టీసీ గ‌మ‌నించింది. కౌంటర్లు లేటుగా తెరవటం, త్వ‌రగా మూసేయటం, సేవ‌లు ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డం, నిర్వహణ లోపాల వల్లే బుకింగ్‌లు తగ్గాయని ఆర్టీసీ భావిస్తోంది. ఇక‌ డిపో అధికారుల పర్యవేక్షణ లోపం ఉంద‌ని కూడా ఆర్టీసీకి నివేదిక‌లు అందాయి. ఈ పరిస్థితిపై ఫోక‌స్ ఉన్నతాధికారులు… ఏజెంట్ల ప్లేసులో కండక్టర్లను నియమించాలని నిర్ణయించారు.

నష్టాలు వస్తున్న 71 డిపోల్లో ఏజెంట్ల ప్లేసులో కండక్టర్ల నియమించి… బుకింగ్‌ కౌంటర్ల ఆపరేటింగ్‌ సహా నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి 142 మంది కండక్టర్లు అవసరమవుతారని భావిస్తోన్న‌ ఆర్టీసీ.. అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశించింది. డిగ్రీ కలిగి ఉండి, కంప్యూటర్ నాలెడ్జ్, మంచి న‌డ‌వ‌డిక‌, ఇతర నైపుణ్యాలున్న కండక్టర్లను ఎంపిక చేయాలని నిర్ణయించింది. జులై 13 నాటికి ఎంపిక ప్రక్రియ కంప్లీట్ చేయనుంది. ఇదివరకే ఉన్న ఏజెంట్లతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోకుండా..ప‌ట్ట‌ణాల్లోని పలు ప్రాంతాల్లో లాజిస్టిక్ సెంట‌ర్లు ఏర్పాటు చేసి వ్యాపారాన్ని వారు నిర్వహించేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


Tags:    

Similar News