ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ బిగ్ షాక్.. టికెట్ పై భారీ వడ్డన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఏపీఎస్ ఆర్టీసీ) ప్రయాణీకులకు భారీ షాక్ ఇవ్వనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఏపీఎస్ ఆర్టీసీ) ప్రయాణీకులకు భారీ షాక్ ఇవ్వనుంది. ఈ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఛార్జీలు భారీగా పెంచాలని నిర్ణయించింది. 2021 జనవరి 8 నుంచి 13 వరకూ ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి రాష్ట్రానికి ఈ సర్వీసులు నడవనున్నాయి. ఆంధ్రకు వచ్చే వారికి 50 శాతం టికెట్ ధర పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా 3606 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నమని చెప్పారు. స్పెషల్ బస్సుల్లో ప్రయాణించాలంటే 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చెస్తామని కృష్ణబాబు వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య నిత్యం మరో 48 వేల కి.మీ. మేర సర్వీసులు నడిపేలా చర్చలు జరిపాలని నిర్ణయించామని.. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినట్లు ఎండీ కృష్ణబాబు తెలిపారు.
గతేడాది నవంబరు 30 నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.3,350 కోట్లు కాగా, ఈ ఏడాది అదే కాలానికి కేవలం రూ.827 కోట్లని కృష్ణబాబు తెలిపారు.కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీకి రూ.2,528 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మాముల రోజుల్లో టికెట్ ధర 200 రూపాయలు ఉంటే సంక్రాంతి సందర్భంగా 300 రూపాయలు ఉంటుంది. ప్రతి ఏటా పండగ సందర్భంగా ఛార్జీల పెంపు మామూలే. అయితే ఈ సారి కరోనా ప్రభావంతో ప్రయాణికులు సంఖ్య తగ్గడం.. లాక్ డౌన్ సమయంలో బస్సులు నడవకపోవడంతో ఆర్టీసీ ఆదాయం గణణీయంగా తగ్గిపోయింది. దీంతో ఈ సారి ఛార్జీ పెంపు తప్పదని పేర్కొంది. ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్- తెలంగాణ సర్వీసులు పెంచేందుకు ప్రయత్నాలు చేసింది.