APSRTC Cancelled Bus Services: ఆ రూటులో ఆర్టీసీ సర్వీసులు నిలిపివేత.. డబ్బులు తిరిగి చెల్లిస్తామంటున్న ఆర్టీసీ

APSRTC Cancelled Bus Services: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పటివరకు తిప్పుతున్న రూట్లలో తన సర్వీసులను కుదిస్తోంది.

Update: 2020-07-09 04:00 GMT
APSRTC (File Photo)

APSRTC Cancelled Bus Services: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పటివరకు తిప్పుతున్న రూట్లలో తన సర్వీసులను కుదిస్తోంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర సర్వీసులపై ఈ కుదింపు చర్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ముందస్తుగా రిజర్వేషను చేయించుకున్నవారికి తిరిగి నగదు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది.

ఆదివారం రోజున కడప-బెంగళూరు మధ్య నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు స‌ర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డ‌బ్బులు రిట‌న్ చేస్తామ‌ని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న నేప‌థ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ ఉనందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్ల‌డించారు. కాగా మిగతా రోజుల్లో స‌ద‌రు రూటులో ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు, అధికార యంత్రాంగం హడలెత్తిపోతున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. రోజుకు వెయ్యికి పైగానే పాజిటివ్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 22259కు చేరింది. కాగా, అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2722 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 2568కు చేరాయి. గుంటూరు జిల్లాలో 2435 కేసులు ఉన్నాయి. 



Tags:    

Similar News