APSRTC: ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న APSRTC

APSRTC: ఏసీ స్లీపర్ బస్సులకు పెరుగుతున్న ఆదరణ మరింత విస్తరించే ఆలోచనలో APSRTC

Update: 2023-06-15 12:32 GMT

 APSRTC: ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న APSRTC

APSRTC: ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖవంతం..ఇదే నినాదంతో ప్రయాణికుల అవసరాలను తీరుస్తోంది ఏపిఎస్ ఆర్టీసీ. ప్రజా రవాణాలో ఘనకీర్తిని సాధిస్తున్న ఏపిఎస్ ఆర్టీసీ ఇప్పుడు మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. ఉన్నత స్ధాయిలో మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ బస్సులు దూసుకెళుతున్నాయి. పీకల్లోతు అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేర్చడమే కాకుండా కొత్త సర్వీసులను అమల్లోకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యింది ఏపిఎస్ ఆర్టీసీ.

ఏపీఎస్ ఆర్టీసీకి కొత్త సర్వీసులు ఆశాజనకంగా మారుతున్నాయి. .ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు కొత్త సర్వీసులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఇప్పటికే ఏపీఎస్‌ ఆర్టీసీ మన్ననలు పొందింది. పలు జాతీయ స్థాయి అవార్డులు సైతం ఆర్టీసీ సొంతం చేసుకుంది. ప్రయాణికుల సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీలో అధునాతన ఏసీ బస్సులు ఉన్నాయి. వీటికి తోడు గా ఇటీవల అందుబాటులోకి తెచ్చిన స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది.

స్టార్‌ లైనర్‌ సర్వీసుల ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఏసీ సీటింగ్‌ కమ్‌ స్లీపర్‌ బస్సులను ప్రవేశ పెట్టారు. ఇప్పటికే విశాఖ-విజయవాడ మధ్య నడుస్తున్న నైట్‌రైడర్‌ సర్వీసులకు పెద్ద ఎత్తున ప్రయాణికుల ఆదరణ లభిస్తోంది. వీకెండ్ లో ఈ సర్వీసుల్లో టిక్కెట్లు దొరకడమే కష్టంగా మారింది. పైగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు నైట్‌రైడర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా సర్వీసులు నడపడంతో పాటు మరిన్ని మెరుగైన సేవలు అందించడంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

నాన్‌ ఏసీ స్టార్‌ లైనర్‌ సర్వీసులకు ఆదరణ పెరిగిన నేపధ్యంలో వేసవిలో నైట్‌ రైడర్‌ పేరిట ఏసీ సర్వీసులు ఏపీఎస్‌ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వీటిని నడుపుతున్నారు. 

Tags:    

Similar News