Nadendla Manohar: రాష్ట్ర విభజన తర్వాత NFSA ప్రకారం ఏపీకి అన్యాయం జరిగింది

Nadendla Manohar: ఏపీకి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం

Update: 2024-08-08 16:21 GMT

Nadendla Manohar: రాష్ట్ర విభజన తర్వాత NFSA ప్రకారం ఏపీకి అన్యాయం జరిగింది

Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌కు లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రేషన్‌ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం ఏపీకి చాలా అన్యాయం జరిగిందన్నారు. విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా.. 2001 సెన్సెస్‌ ప్రకారం కేటాయించారు. దీంతో ఏపీకి రేషన్‌ కార్డులు బాగా తగ్గిపోయాయినట్టు తెలిపారు. గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని, పౌరసరఫరాలశాఖకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు.

Tags:    

Similar News