AP Voters List 2024: ఏపీలో 4.08 కోట్ల ఓటర్లు.. పురుషుల కంటే మహిళలే అధికం

AP Voters List 2024: తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం

Update: 2024-01-23 05:44 GMT

AP Voters List 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల ఎనిమిది లత్రల ఏడు వేల 256కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 చేపట్టిన ఎన్నికల సంఘం నిన్న తుది జాబితా ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా ఐదు లక్షల యనభై ఆరు వేల 530 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది అక్టోబరు 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నాలుగు కోట్ల రెండు లక్షల ఇరవైఒక్క వేల 450 మంది ఓటర్లు ఉండగా.. ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 22లక్షల 38వేల 952 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది.

16లక్షల 52వేల 422 మందిని తొలగించింది. మొత్తంగా ఓటర్ల నికర పెరుగుదల 1.46 శాతంగా ఉంది. తుదిజాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 6లక్షల 55వేల 130 మంది అధికంగా ఉన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 25 జిల్లాల్లో పెరగ్గా.. ఒక్క నెల్లూరు జిల్లాలో స్వల్పంగా తగ్గింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 45వేల 403 మంది, అన్నమయ్య జిల్లాలో 44వేల 614 మంది, కర్నూలు జిల్లాలో 43వేల 466 మంది ఓటర్లు పెరిగారు. నెల్లూరు జిల్లాలో 2వేల 934 మంది తగ్గారు.

Tags:    

Similar News