నేడు సుప్రీంకోర్టులో ఏపీ మూడు రాజధానుల కేసు విచారణ

*హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌పై విచారణ జరపనున్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం

Update: 2022-11-01 02:24 GMT

నేడు సుప్రీంకోర్టులో ఏపీ మూడు రాజధానుల కేసు విచారణ

Supreme Court On Amaravati: నేడు సుప్రీంకోర్టులో ఏపీ మూడు రాజధానుల కేసు విచారణకు రానుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మూడు రాజధానులకు అనుకూలంగా బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఒకే చోట నిధుల కేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. 

అమరావతి ప్రాంతం రాజధానికి అనువైన ప్రాంతం కాదంటూ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల నివేదికల్లో స్పష్టం చేసింది. అయితే విభజన చట్టం ప్రకారం రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారం ఉందని ఏపీ వాదిస్తోంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రాజధాని మార్పు అనివార్యం అని పిటిషన్‌లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం రాజధాని భూ సమీకరణలో అనేక లోటుపాట్లు అవకతవకలు జరిగాయని పిటిషన్‌లో పొందుపర్చింది.

Tags:    

Similar News