వైసీపీ సర్కారు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మధ్య మరోసారి వివాదం

Update: 2021-01-29 15:30 GMT

ఏపీలో వైసీపీ సర్కారు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ మధ్య మరోసారి వివాదం చెలరేగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గొడవ సద్దుమణిగిందనుకుంటే మళ్లీ అగ్గిరాజుకుంది. ఓ పక్క ఎస్‌ఈసీ లేఖలు, మరోపక్క సజ్జల, విజయసాయిరెడ్డి విమర్శలతో ఉత్కంఠ భరిత పోరు సాగుతోంది.

సాధారణంగా ఎన్నికలంటే.. అధికార పార్టీ, ప్రతిపక్షాలు కత్తులు నూరుకోవాలి. కానీ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం డిఫ్రెంట్‌గా ఎన్నికల సంఘం, అధికార పక్షం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎస్‌ఈసీ చర్యలుప్రభుత్వానికి నచ్చడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలు ఎస్‌ఈసీకి పొసగడం లేదు.

అధికార నేతలను ఇరుకున పెట్టేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్‌ లేఖాస్త్రాలను వదులుతున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సహకరించని అధికారులపై, తనపై విమర్శలు చేస్తున్న మంత్రులు, సలహాదారులపై చర్యలు కోరుతూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ సీఎస్‌, గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. తాజాగా కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌వోసీలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు తొలగించాలని, ధ్రువీకరణ పత్రాల జారీలో వివక్ష, జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు.

నిమ్మగడ్డ లేఖలపై సజ్జల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారిందని అన్నారు. తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాచరికం, పాలెగాళ్ల పోకడలు నిమ్మగడ్డలో కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడని అన్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ, కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

ఎన్నికల సంఘం కమిషన్‌ కార్యదర్శి నియామకం విషయంలోనే అధికార పార్టీ, ఎస్‌ఈసీ మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ముందుగా ఎస్‌ఈసీ రవిచంద్రను నియమించానలి ఎస్ఈసీ కోరింది. కానీ ప్రభుత్వం రవిచంద్రకు వేరే బాధ్యతలు అప్పగించి, విజయ్ కుమార్, కన్నబాబు, రాజబాబుల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో ఎస్‌ఈసీ కన్నబాబును ఫైనల్ చేసింది. 

Tags:    

Similar News