Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
Andhra Pradesh: నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో మరోకరు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది.
Andhra Pradesh:మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఏపీ ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 28లోగా మధ్యాహ్నం 3గంటలలోపు నామినేషన్ వేసేందుకు వెసులుబాటు కల్పించామన్నారు ఎస్‌ఈసీ. మొత్తం 56 మంది మరణించినట్లు ధృవీకరించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. వైసీపీ -28, టీడీపీ 17, బీజేపీ -5, సీపీఐ-3, కాంగ్రెస్-2, జనసేన ఒకరు మరణించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మరణించిన వారి స్థానంలో మరోకరు నామినేషన్ వేసేందుకు అవకాశం ఇచ్చింది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక.. గతంలో ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆగిందో.. తిరిగి అక్కడినుంచే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది ఎస్ఈసీ. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ప్రకటించింది.
కాగా.. ఏపీలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాల్టీ, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ రీలీజ్ అయింది. గత ఏడాది మార్చి 9న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. నామినేష్ల పరిశీలన అనంతరం కోర్టు ఉత్తర్వులతో గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియను నిలిపివేశారు.