Andhra Pradesh: జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు
ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో క్లారిటీ వచ్చాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.రేపు స్పష్టత రాకపోతే ఎన్నికలు మరింత జాప్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎస్‌ఈసీ, ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సిబ్బంది అంకితభావంతో పని చేశారన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్. ప్రతి విడతల్లోనూ అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్నారని ఒకట్రెండు చోట్ల ఇబ్బందులున్నా.. సమన్వయం చేశారన్నారు.
నాలుగు విడతలోనూ 80 శాతానికి పైగా పోలింగ్ నమోదవ్వడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఎక్కడా ఎన్నికలు వాయిదా పడలేదని.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు.ముగిసిన పంచాయతీ ఎన్నికలు..ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే? ఏపీ మొత్తం 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగం అంకితభావంతో పని చేసిందని కితాబిచ్చారు. 10,890 మంది సర్పంచులు, 47,500 మంది వార్డు మెంబర్లు నేరుగా ఎన్నికైనట్లు వెల్లడించారు. మొత్తం 16 శాతం స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయన్నారు.