హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎస్‌ఈసీ నోటిఫికేషన్, కౌంటింగ్‌ ఈ రోజే...

AP MPTC ZPTC Election Results 2021: *ఉదయం 10గంటలకు సమావేశం ప్రారంభం *కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై చర్చ

Update: 2021-09-17 02:45 GMT

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎస్‌ఈసీ నోటిఫికేషన్, కౌంటింగ్‌ ఈ రోజే...

AP MPTC ZPTC Election Results 2021: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ నేడు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ తదితరులు పాల్గొంటారు.

రాష్ట్రవ్యాప్తంగా 7వేల 220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఎన్నికలు జరిగినప్పటికీ న్యాయ వివాదాలతో కౌంటింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది. దాదాపు ఆరు నెలల అనంతరం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించేందుకు అనుమతించడంతో 19వ తేదీన కౌంటింగ్‌ జరపనున్నట్టు ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News