AP 10th Exams: టెన్త్ పరీక్షలపై కీలక ప్రకటన..
AP 10th Exams: విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
AP 10th Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో ఈ నెల 5 నుంచి జరగాల్సి ఉన్న ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. పది పరీక్షలు నిర్వాహిస్తారా లేక వాయిదా వేస్తారా అనే ప్రకటన రావపోవడంతో విద్యార్థుల్లో అందోళన నెలకొంది. అయితే పరిస్థితులు చక్కబడేవరకు టెన్త్ ఎగ్జామ్స్ ను కూడా ప్రభుత్వం వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఏపీలో కొంత మంది విద్యార్థులు ఈ విషయమై హై కోర్టును కూడా ఆశ్రయించడంతో విచారణ సైతం జరుగుతోంది. పది పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వీ. చినభద్రుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఈ నెలాఖరులో స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. గోదావరి జిల్లాలోని ఏలూరులోని జీఎంసీ బాలయోగి సైన్స్ పార్కును ఆయన బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా చినవీరభద్రుడు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
కొందరు ఉపాధ్యాయులు సహకరించకపోగా.. అనవసరంగా రాద్ధాంతాలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే పదో తరగతి పరీక్షలపై కీలక ప్రకటన వస్తుందని చినభద్రుడు తెలిపారు. విద్యార్థల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందిని తెలిపారు. గత సంవత్సరం కరోనా కారణంగా పరీక్షలు రద్దయ్యాయన్నారు. ప్రతి సంవత్సరం పరీక్షలు రద్దు చేసుకుంటూ పోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని ఆయన అన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని హితవు పలికారు.