Chandrababu: చంద్రబాబు చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు

Chandrababu: తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించిన జైళ్లశాఖ డీఐజీ

Update: 2023-10-15 06:44 GMT

Chandrababu: చంద్రబాబు చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు

Chandrababu: రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత ఆరోగ్యంపై కుటుంబసభ్యుల వరుస ట్వీట్లు ఒక్కసారిగా హైప్ ను క్రియేట్ చేశాయి. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టడంతో ప్రభుత్వ వైద్యులతో కీలక రిపోర్టును రిలీజ్ చేయించారు జైలు అధికారులు. చంద్రబాబు కేవలం చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రభుత్వ వైద్యులు వివరించారు.

చంద్రబాబుకు కేవలం స్కిన్ సంబంధిత సమస్యలే ఉన్నాయని, ఆస్పత్రికి తరలించాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. ఆయన ఫిజికల్ గా,మెంటల్ గా యాక్టివ్ గానే ఉన్నారని రిపోర్టు రిలీజ్ చేశారు. అయితే చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు.

అయితే.. డాక్టర్ల బృందం ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. తమపై వస్తున్న వార్తలకు ఖండించిన డీఐజీ.. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించట్లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు 24 గంటల పాటు వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అన్ని వేళలా అధికారులు అందుబాబులో ఉంటున్నారని.. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వ వైద్యుల బృందం.. బాబు వ్యక్తిగత డాక్టర్లతో మాట్లాడినట్టు చెప్పారు.

అయితే వైద్యుల రిలీజ్ చేయాల్సిన హెల్త్ బులెటిన్ ను జైలు అధికారులు ఇవ్వడమేంటని టీడీపీ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు ఎందుకు పాటించడంలేదంటూ కార్నర్ చేశారు. చంద్రబాబును అనారోగ్యానికి గురి చేసి, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలపై మాటల దాడి చేశారు. మరో వైపు టీడీపీ ఆరోపణలకు వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇచ్చారు. టీడీపీ కావాలనే అవాస్తవాలను ప్రచారం చేస్తోందని కౌంటర్ అటాక్ కు దిగింది అధికార పార్టీ. చంద్రబాబు బయట ఉన్నా, జైల్లో ఉన్నా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఏపీ రాజకీయాలు మొత్తం టీడీపీ అధినేత ఆరోగ్యం చుట్టే తిరుగుతున్నాయి.

Tags:    

Similar News