AP Politics : చంద్రబాబు చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్.. టీడీపీ అధినేత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యుల ఆందోళన
AP Politics : చంద్రబాబు బరువు తగ్గారని ట్వీట్ చేసిన భువనేశ్వరి బరువు పెరిగారంటూ వైసీపీ రివర్స్ అటాక్
AP Politics : ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టే తిరుగుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు సహా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బరువు తగ్గారు అని టీడీపీ అంటుంటే లేదు లేదు బరువు పెరిగారంటూ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది అధికార వైసీపీ. ప్రస్తుతం చంద్రబాబు బరువు అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత బరువు చుట్టూ మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబుకు జైలుకు వెళ్లి దాదాపు నెల రోజులు దాటిపోయింది. ఓ వైపు బెయిల్ కోసం మరో వైపు కేసును క్వాష్ చేయాలంటూ న్యాయం పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబసభ్యులు సహా టీడీపీ నేతలు ఆరోగ్య సమస్యపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ట్వీట్ చేయడంతో అసలు కథ్ స్టార్ అయింది. చంద్రబాబు 5 కేజీల వెయిట్ లాస్ అయ్యారని భువనేశ్వరి, బ్రాహ్మణి ట్వీట్ చేశారు. స్టెరాయిడ్లు ఎక్కించేందుకు ట్రై చేస్తున్నారంటూ మరో వైపు నారా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. జైలులో చంద్రబాబుకు సరైన వైద్యం అందించడంలేదంటూ ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు నారా లోకేశ్.
అయితే జైలు అధికారులు, వైసీపీ నేతలు మాత్రం అందులో వాస్తవం లేదంటున్నారు. అన్నీ సౌకర్యాలు కల్పించడానికి జైలేమీ చంద్రబాబు అత్తారిల్లు కాదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరో వైపు చంద్రబాబు బరువు తగ్గారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు కోస్తాంధ్ర జైళ్లశాఖ డీఐజీ. చంద్రబాబు ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి చంద్రబాబు బరువు అంశం ఏపీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఆరోపణలు, కౌంటర్లు, క్లారిఫికేషన్లతో సీన్ హీటెక్కింది.