AP Police Humane Gesture: మానవత్వం చూపించిన ఏపీ పోలీసులు..కుటుంబీకులు వదిలేసినా..

AP Police Humane Gesture: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి.. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరి పోరాడుతున్నారు. కరోనా

Update: 2020-07-27 16:08 GMT
AP police showing humanity

AP police showing humanity : కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి.. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరి పోరాడుతున్నారు. కరోనా పోరాటంలో భాగంగా వారు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. ఇక మానవత్వం చూపించడంలోనూ పోలీసులు అందరికంటే ముందే ఉంటున్నారు.

తాజాగా తన కొడుకు కరోనా లక్షణాలతో చనిపోవడంతో నిరాదరణకు గురైన ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. దీనితో ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయేమో అని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక పోలీసులు మానవత్వం చూపించారు. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చొరవతో సీఐ భీమేశ్వర రవి కుమార్, ఎస్సై చల్లా కృష్ణ ఆ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. అటు మరణాల సంఖ్య వెయ్యికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,051 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ కారణంగా మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,02,34కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు ఏపీలో 16,86446 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం. 


Tags:    

Similar News