అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్..? అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం

Anantha Udaya Bhaskar:

Update: 2022-05-22 04:06 GMT

అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్..? అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం

Anantha Udaya Bhaskar: సుబ్రహ్మణ్యం ‎హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే అనంత ఉదయ్‌భాస్కర్ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏదీ ఏమైనా ఇవాళ అనంత ఉదయ్‌ భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

కాగా.. సుబ్రహ్మణ్యం మృతదేహానికి అర్ధరాత్రి పోస్టుమార్టం పూర్తయ్యింది. ఎస్పీ ప్రెస్‌మీట్‌ తర్వాత పోస్టుమార్టంకి అంగీకరించింది మృతుడి భార్య అపర్ణ. ఇక సుబ్రహ్మణ్యం మృతదేహం కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. పెదపూడి మండలం జి.మామిడాలో ఇవాళ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags:    

Similar News