ఏపీ పంచాయతీ ఎన్నికలు: ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు నామినేషన్లు

Update: 2021-01-29 13:30 GMT

ఏపీ పంచాయతీ ఎన్నికలు: ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు నామినేషన్లు

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. తొలిరోజు నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 339 పంచాయతీల్లో మొదటి దశలో ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసినా.. వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లు స్వీకరించేందుకు పెద్ద పంచాయతీల్లో రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. మిగిలిన చోట్ల సహాయ రిటర్నింగ్‌, స్టేజి-1 అధికారులను కలెక్టర్లు నియమించారు. తొలి దఫాలో ఎన్నికలు జరిగే చోట్ల ఇవాళ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.

మరోవైపు.. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకునేవారు ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేయాలి. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచి 3 రోజులపాటు వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9న ఎన్నికలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News