AP new sand policy: ఇసుక తవ్వకాలపై ఏపీ కొత్త మార్గదర్శకాలు!
AP new sand policy: కొత్త ఇసుక పాలసీని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇసుక తవ్వకాలు, రవాణా, సరఫరా క్రమబద్దీకరణలపై ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు.జారీచేసింది. ప్రస్తుతం ఉన్న విధానాలను సమీక్షించిన ప్రభుత్వం కొత్తగా ఇసుక తవ్వకాలు, లోడింగ్, సరఫరా, డోర్ డెలివరీకి వివిధ స్థాయిల్లో బేస్ రేట్లు నిర్ణయిస్తూ గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం..
- ఓపెన్ రీచ్‌లు, పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకానికి టన్నుకు రూ.90గా నిర్ణయం.
- జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్ రుసుము టన్నుకు రూ.25గా నిర్ధరణ.
- ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు.
- గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణా టన్నుకు జీఎస్టీతో కలిపి కి.మీ రూ.3.30గా నిర్ణయం.
- డోర్ డెలివరీ కోసం 10కి.మీ లోపు దూరానికి ట్రాక్టర్ ద్వారా టన్నుకు రూ.10, లారీ ద్వారా టన్నుకు రూ.8, పెద్ద లారీకి టన్నుకు రూ.7 వసూలు.
- ఈ ధరలు 40 కి.మీ దూరం వరకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడి.
- 40కి.మీ దాటితే ప్రతి టన్నుకు రూ అదనంగా 4.90 రూపాయల చొప్పున ధర నిర్ణయం.
- కొత్త ధరలపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఏపీ ప్రభుత్వ సూచనలు.