AP New Cabinet: కొత్త మంత్రుల జాబితా రెడీ? మళ్లీ కొనసాగేది..

AP New Cabinet: ఏపీ కేబినెట్ బెర్తులు ఎవరికి దక్కుతాయ్? ఎవరికి మోదం, ఎవరికి ఖేదమని గత వారం రోజులుగా చర్చపోచర్చలు సాగుతూనే ఉన్నాయ్.

Update: 2022-04-09 13:00 GMT

AP New Cabinet: కొత్త మంత్రుల జాబితా రెడీ? మళ్లీ కొనసాగేది..

AP New Cabinet: ఏపీ కేబినెట్ బెర్తులు ఎవరికి దక్కుతాయ్? ఎవరికి మోదం, ఎవరికి ఖేదమని గత వారం రోజులుగా చర్చపోచర్చలు సాగుతూనే ఉన్నాయ్. అయితే సీఎం జగన్ 25 మంది లిస్ట్ ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా ఇంకా మార్పులు, చేర్పులపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్లు, జూనియర్లు అంటూ చర్చలు జరుగుతున్నా ఎవరిని కేబినెట్‌లోకి తీసుకుంటే ఏమవుతుందన్నదానిపై జగన్ మల్లగుల్లాలుపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మధ్య సమతూల్యం తీసుకురావాలని కూడా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

సిదిరి అప్పలరాజు- పలాస బీసీ- మత్స్యకార వర్గం నుంచి, ధర్మాన ప్రసాదరావు- శ్రీకాకుళం బీసీ-పొలినాటి వెలమ నుంచి కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. లేదంటే ఆయన సూచించినవారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తారన్న వర్షన్ ఉంది. ఇక ఎస్టీల నుంచి రాజన్న దొర, కొట్టగుల్లి భాగ్యలక్ష్మికి ఛాన్స్ లభించనుంది. కరణం ధర్మశ్రీ.. చోడవరం బీసీ తూర్పు కాపు నుంచి... దాడిశెట్టి రాజా-తుని... కాపు సామాజికవర్గం నుంచి కేబినెట్‌లో రానున్నట్టు తెలుస్తోంది. ఇక చెల్లుబోయిన వేణుగోపాల్- రామచంద్రాపురం... బీసీ-శెట్టి బలిజ నుంచి కేబినెట్లో కొనసాగే అవకాశం ఉంది. కొండేటి చిట్టిబాబు- పి గన్నవరం ఎస్సీ మాల, తానేటి వనిత-కొవ్వూరు ఎస్సీ- మాదిగ కేబినెట్‌లో బెర్త్ దాదాపు కన్ఫామంటున్నారు. బీసీ యాదవకు చెందిన కారుమూరి నాగేశ్వరరావు- తణుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పై అనూహ్యం విజయం సాధించిన గ్రంధి శ్రీనివాసరావుకు కేబినెట్ లో బెర్త్ ఖాయమని తెలుస్తోంది.

కేబినెట్ లో ఫైర్ భ్రాండ్ నేత కొడాలి నాని, ఇక బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేష్, చిలకలూరి పేట నుంచి విడదల రజినికి బెర్త్ ఖాయమన్న వర్షన్ ఉంది. మెరుగు నాగార్జున- వేమూరు ఎస్సీ మాల, ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెం ఎస్సీ మాదిగ కేబినెట్లో కొనసాగొచ్చు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి-సర్వేపల్లి నుంచి, జొన్నలగడ్డ పద్మావతి- శింగనమల ఎస్సీ మాల ఛాన్స్ లభించవచ్చు. శంకర్ నారాయణ-పెనుకొండ నుంచి కేబినెట్ లో మళ్లీ చోటు దక్కించుకోవచ్చు. ఇక పార్టీ సీనియర్ నేత నెంబర్ 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు కొనసాగొచ్చు. లేదంటే ఆయన సూచించిన వారికి కేబినెట్లో చోటు కల్పించవచ్చు. గుమ్మనూరి జయరామ్-ఆలూరు కేబినెట్ లో మళ్లీ ఉండే అవకాశం ఉంది. శిల్పా చక్రపాణి రెడ్డి- శ్రీశైలం నుంచి కేబినెట్ లో కి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఉమ్మడి కడప నుంచి అంజద్ భాష, కోరుముట్ల శ్రీనివాస్-కోడుమూరు ఎస్సీ-మాల కేబినెట్ లో బెర్త్ ఖరారు కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. ఉషశ్రీ చరణ్ కేబినెట్ లోకి రానున్నరని పార్టీ వర్గాలు చెబుతుంటే రోజాకు ఛాన్స్ ఖాయమని తెలుస్తోంది. 

Tags:    

Similar News