Chandrababu Cabinet: కొలువుదీరిన చంద్రబాబు టీమ్.. ఏయే వర్గాల వారికి ఎన్ని పదవులు దక్కాయంటే..
ఇక చంద్రబాబు మంత్రివర్గంలో 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది.
Chandrababu Cabinet 4.0: విభజన ఆంధ్రప్రదేశ్‌లో మూడో ప్రభుత్వం కొలువుదీరింది. అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగా... జనసేనాని పవన్ కల్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ఒక మంత్రి స్థానాన్ని ఖాళీగా ఉంది. మొత్తం 24 మంది మంత్రుల్లో జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు చోటు దక్కించుకున్నారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కగా.. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్‌కు కేబినెట్ బెర్త్ దక్కింది. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు దక్కాయి.
ఇక చంద్రబాబు మంత్రివర్గంలో 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. ఉమ్మడి జిల్లాలవారీగా లెక్క చూస్తే.. గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రిపదవులు దక్కాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి మంత్రి పదవులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం దక్కలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి కూడా ఒక్కొక్కరికే చాన్సు దక్కింది.
ప్రమాణ స్వీకారం చేసింది వీరే..
1. పవన్ కల్యాణ్ (జనసేన)
2. నారా లోకేశ్ (టీడీపీ)
3. అచ్చెన్నాయుడు (టీడీపీ)
4. కొల్లు రవీంద్ర (టీడీపీ)
5. నాదెండ్ల మనోహర్ (జనసేన)
6. పి. నారాయణ (టీడీపీ)
7. వంగలపూడి అనిత (టీడీపీ)
8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ)
9. నిమ్మల రామానాయుడు (టీడీపీ)
10. ఎన్.ఎమ్.డి ఫరూక్ (టీడీపీ)
11. ఆనం రామనారాయణరెడ్డి (టీడీపీ)
12. పయ్యావుల కేశవ్ (టీడీపీ)
13. అనగాని సత్యప్రసాద్ (టీడీపీ)
14. కొలుసు పార్థసారథి (టీడీపీ)
15. డోలా బాలవీరాంజనేయస్వామి (టీడీపీ)
16. గొట్టిపాటి రవి (టీడీపీ)
17. కందుల దుర్గేశ్ (జనసేన)
18. గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ)
19. బీసీ జనార్దన్‌రెడ్డి (టీడీపీ)
20. టీజీ భరత్ (టీడీపీ)
21. ఎస్.సవిత (టీడీపీ)
22. వాసంశెట్టి సుభాష్ (టీడీపీ)
23. కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ)
24. మందిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి (టీడీపీ)