Minister Sandhyarani: మంత్రి సంధ్యారాణికి తృటిలో తప్పిన ప్రమాదం..

మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ప్రమాదం తప్పింది. ఆరికతోట సమీపంలో మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురయ్యింది.

Update: 2024-09-12 06:04 GMT

Minister Sandhyarani: మంత్రి సంధ్యారాణికి తృటిలో తప్పిన ప్రమాదం..

Ap Minister Sandhya Rani Convoy Accident: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ప్రమాదం తప్పింది. ఆరికతోట సమీపంలో మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురయ్యింది. విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఆరికతోట దగ్గర మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం టైరు పేలింది.. దీంతో వాహనం అదుపుతప్పి మరో వ్యాన్‌ను ఢీకొట్టింది. మంత్రి వాహనం ఆ వెనుకే ఉంది.. ఈ ప్రమాదం నుంచి సంధ్యారాణి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదంలో ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని విజయనగరం పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. సాలూరు నుండి మంత్రి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంత్రి సంధ్యారాణి దగ్గరుండి ప్రమాదంలో గాయపడినవారిని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News