Botsa Satyanarayana: అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్టే..

Botsa Satyanarayana: అమరావతి రైతుల పాదయాత్ర వట్టి భోగస్ అని తేలిపోయిందన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.

Update: 2022-10-25 15:30 GMT

Botsa Satyanarayana: అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్టే..

Botsa Satyanarayana: అమరావతి రైతుల పాదయాత్ర వట్టి భోగస్ అని తేలిపోయిందన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కోర్టు మార్గదర్శకాల తర్వాత ఈ యాత్రలో 600 మంది కాదు కదా కనీసం 60 మంది కూడా లేరన్నారు. ఈ అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ వెనుకుండి నడిపిస్తోందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. కోర్టు ఆదేశంతో టీడీపీ నేతల సపోర్టు లేకే అమరావతి రైతులు పాదయాత్రను ఆపేశారన్నారు. ఇక ఉత్తరాంద్ర ప్రజల రాజధాని కల సాకారమైనట్లేనని స్పష్టం చేశారు.

మున్ముందు విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏర్పాటుకున్న అడ్డంకులన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన మంత్రి బోగాపురం ఎయిర్పోర్ట్ , గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వచ్చే నెలలో ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోనున్న నేపథ్యంలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అనంతరం మంత్రి అమరాతి రైతుల పాదయాత్రపై ఇలా స్పందించారు. 

Tags:    

Similar News