AP Inter Hall Ticket: ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌

AP Inter Hall Ticket: ఏప్రిల్‌ 29వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.

Update: 2021-04-29 11:11 GMT

ఆదిమూలపు సురేష్ ఫైల్ ఫోటో

AP Inter Hall Ticket: ఇంటర్‌ విద్యార్థుల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ సాయంత్రం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు అనివార్యమని, మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం. ఇందకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ అధికారిని నియమించాం. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తాం. ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేశాం. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏప్రిల్‌ 29వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు.

Tags:    

Similar News