రాష్ట్రంలో మహిళలపై గృహహింస వేధింపులు పెరిగాయని దాదాపు 200లకు పైగాఫిర్యాదులు వచ్చాయని మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా బుధవారం ఆమె మీడియా సమావేశంలో అన్నారు. కరోనా నేపథ్యంలో అర్థిక భద్రత అనేది పెరిగిందన్నారు.
ఇంకా ఆమె ఏమ్మన్నారంటే..
*రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో చాలా వరకు గృహహింస కేసులు తక్కువ నమోదయ్యాయని వెల్లడించారు.
*ఆర్థిక సహాయం కోసం ఇలా అనేక రకాల ఫిర్యాదుల వచ్చాయని పేర్కొన్నారు.
*మా పరిధి కాదనే ఆలోచన లేకుండా ఏ ఒక్కకేసును నిర్లక్ష్యం చేయలేదన్నారు.ఫిర్యాదులను బట్టి తగిన సహాయం చేశామన్నారు.
*ఇక లాక్డౌన్ కారణంగా ఇళ్లలో ఉండే మహిళల పరిస్థితి తారుమారు అయ్యాయి అనేదే లేదన్నారు.
*గృహ హింసకు సంబంధించినకేసులన్ని కూడా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారించామని తెలిపారు. దాదాపుగా కౌన్సెలింగ్ ద్వారా చాలా వరకు పోలీసు స్టేషన్కు వెళ్లకుండానే పరిష్కారం అందించామని చెప్పారు.
*ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో చాలా వరకు మహిళలు సంతోషంగాఉన్నారని, అమ్మఒడి, ఇళ్ల పట్టాలు వంటి *పథకాలుఅందించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
*గ్రామ సచివాలయంలో ఉన్నవారంతా కూడా మహిళలకు రక్షణగా నిలుస్తున్నారని తెలిపారు.
*దిశ చట్టం అమలులోకి వచ్చాక మూడు నెలల్లో 167 కేసులను చార్జీ షీట్ ఫైల్ చేశామన్నారు. అందులో 20 కేసులకు శిక్షణను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు.
* వైఎస్ జగన్ ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఇచ్చి మహిళ సాధికారతను అందించారని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు.