AP Inter Colleges: జూనియర్ కాలేజీలకు సెలవులు..కొత్త షెడ్యూల్ పై క్లారీటి
AP Intermediate Colleges: ఏపీలో జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది ఇంటర్ బోర్డు. ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. తిరిగి పరీక్షల తేదీలు ప్రకటించే వరకు కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అయితే కొత్త షెడ్యూల్ ఎప్పుడు అనేది కూడా స్పష్టం చేసారు. కొత్త షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగా విద్యార్థులకు తెలియచేస్తామని చెప్పారు ఈనెల 5 నుంచి జరగాల్సిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (థియరీ) వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా హైకోర్టు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటూ, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.